తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల ఎనిమిదో తారీఖున రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అదే రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
నిన్న సోమవారం ఆమె దూరదర్శన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు వేస్తుంది అని ఆమె ప్రసంగించారు.
ఈసందర్భంగా ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న పదిహేను రోజుల్లోనే అచ్చమైన తెలంగాణ భాషను నేర్చుకుంటా.. మీతో తెలుగులోనే మాట్లాడతాను అని ఆమె అన్నారు.