టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీకీ సెప్టెంబర్ 2న పశ్చిమ బెంగాల్లోని అలిపోర్ కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కోర్ట్ లో కేసు పెట్టగా అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే వెస్టిండీస్ టూర్ తరువాత షమీ అమెరికా వెళ్ళాడు. ఈ నెల 12కు తిరిగి రానున్నాడు. మరో వారంరోజులే గడువు ఉన్న నేపధ్యంలో షమీకి విముక్తి కలిగిందనే చెప్పాలి. ఎందుకంటే షమీ లాయర్ సలీమ్ రెహమాన్ పై కోర్ట్ నుండి స్టే తీసుకొచ్చారు.