సంక్రాంతి వస్తే చాలు యూత్, ఫ్యామిలీ ఇలా అందరూ సినిమాలు పైనే మొగ్గు చూపుతారు. సంక్రాంతి పండుగకు ఎప్పుడూ టాప్ హీరోలు సినిమాలు వస్తూనే వుంటాయి. కలెక్షన్లు ఎక్కువగా రాబట్టుకోవడానికి సరైన సమయం కూడా ఇదే. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో వస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం ప్రేక్షకులకు మంచిదే గాని ఎటొచ్చి నిర్మాతలే నిరాశకు గురవుతారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ముందుగానే 10వ తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈరోజుని ఎవరు వదులుకుంటారు లేదా రెండు అదే రోజు వస్తాయి అనేది వేచి చూడాల్సిందే.
