టీమిండియాలో మరో ఓపెనర్ ఔట్..ఒకప్పుడు మూడు ఫార్మాట్లో మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్. ప్రస్తుతం తన పేలవ ఫామ్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా అదే ఆటను కొనసాగించాడు ఫలితం ఇప్పుడు తెలిసింది. అయితే భారత్ ఓపెనర్ హిట్ మాన్ రోహిత్ శర్మ ను రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాహుల్ ప్లేస్ లో రోహిత్ ని ఓపెనర్ గా వస్తాడని సెలక్షన్ కమిటీ చీఫ్ ప్రసాద్ చెప్పాడు. ఇది అతని సొంత నిర్ణయం కాదనే చెప్పాలి ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ సైతం రోహిత్ ను బెంచ్ కే పరిమితం చేసిన విషయంలో మండిపడుతున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.