యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం “సాహో”. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ కుమార్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు 350కోట్లు వెచ్చించారు. ఆగష్టు 30న నాలుగు బాషల్లో రిలీజ్ అయ్యింది.సినిమా పరంగా ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అది కూడా హిందీలో సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. మిగతా ప్రాంతాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా కష్టమనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ సాహోను దిల్ రాజు పంపిణీ చేసాడు. కాని చివరికి అతడికి దాదాపుగా 20కోట్లు నష్టం వాటిల్లింది. మరోపక్క సినిమా రిలీజ్ సమయంలో యూవీ క్రియేషన్స్ కు దిల్ రాజు 10కోట్లు సహాయం చేసాడు . ఇప్పుడు అది కచ్చితంగా తిరిగి ఇవ్వాలి. అయితే ఇక అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ యూవీ క్రియేషన్స్ ను తన సొంత బ్యానర్ లా భావిస్తాడు. దాంతో ప్రభాస్ నే స్వయంగా రంగంలోకి దిగి నష్టం వచ్చిందని వివరణ ఇచ్చాడట. దీనికి బదులుగా ప్రభాస్ డేట్స్ దిల్ రాజుకు ఇచ్చాడట.ఈ డీల్ ఓకే అయితే వీరిద్దరికీ మంచిదేనని అనుకుంటున్నారు.
