శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్ళు షాక్ ఇచ్చారు. బోర్డు పాకిస్తాన్లో పర్యటించాలని నిర్ణయించుకుంది.మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆటగాళ్ళకు తెలియజేసింది. కానీ శ్రీలంక ప్లేయర్స్ మలింగ, మాథ్యూస్, పెరేరా మరియు మరో 10మంది ఆటగాళ్ళు పాక్ పర్యటనకు నిరాకరించారు. ఇది బోర్డు కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెజారిటీ ఆటగాళ్ళు పాక్ కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. గతంలో 2009లో పాక్ పర్యటనలో భాగంగా శ్రీలంక ప్లేయర్స్ బస్సులో ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటినుండి అంతర్జాతీయ జట్టు ఏది కూడా ఆ దేశంలో అడుగుపెట్టే సాహసం చెయ్యలేదు. మరి ఆటగాళ్ళు అభిప్రాయం చెప్పారు మరి బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే.