ప్రెజెంట్ జనరేషన్లో పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్ తినడం ఎక్కువై పోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకు జెంట్స్, లేడీస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్లూ పిజ్జాలను తినడం ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్, స్టూడెంట్స్‌కు పిజ్జా ఆర్డర్ చేయనిదే రోజు గడవదు. లంచ్, డిన్నర్లో కూడా ఈ పిజ్జాలు భాగమై పోయాయి. అయితే ప్రతి రోజూ ఈ పిజ్జాలు తినడం వల్ల ఊబకాయం పెరిగిపోతుందని.. గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పిజ్జాలు డైలీ తినే వాళ్లకు లైంగిక చర్య పట్ల ఇంటెస్ట్ తగ్గుతుందని, లేకుంటే పూర్తిగా నశిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు 21 నుంచి 40 ఏళ్ల వయసు కల స్త్రీ, పురుషులను రెండు గ్రూపులుగా విభజించి వారిలో ఒక గ్రూపుకు నెలల తరబడి అందించారు. మరో గ్రూపు వారికి పిజ్జాలు ఇవ్వలేదు. కొన్ని నెలల సుదీర్ఘ అధ్యయనం తర్వాత ఈ రెండు గ్రూపుల వ్యక్తులను పరిశీలిస్తే…పిజ్జాలు తిన్న గ్రూపులో 15 శాతం మందిలో లైంగికాసక్తి పూర్తిగా తగ్గిందని గుర్తించారు. అంతే కాదు వీరు బరువూ కూడా పెరిగారన్న విషయాన్ని గమనించారు. ఇక పిజ్జాలు తినని గ్రూపులో వ్యక్తులను పరిశీలిస్తే..వారిలో లైంగికాసక్తిలో ఏ మాత్రం తేడా లేదని, వారి బరువులో కూడా మార్పు లేదని అధ్యయనంలో తేలింది. చూశారుగా..డైలీ టేస్ట్‌గా ఉంటాయంటూ..ఫ్యాటీ ఫుడ్డు అయిన పిజ్జాలు తింటే శృంగార సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. కాబట్టి పెళ్లి కాని ప్రసాదులు, అమ్మాయిలు బీ అలర్ట్..ఇప్పటి నుండే పిజ్జాలు తినడం మానేయండి..లేకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఓకేనా..
