ఒకే ఒక్కమూవీతో ఒకపక్క యువత మతిని చెడగొడుతూ.. మరోపక్క తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్.
ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా RDX లవ్ అనే మూవీలో నటిస్తుంది.
హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ మూవీకి శంకర్ భాన్ దర్శకుడు. తేజస్ కంర్ల హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్లో అందాల ఆరబోతతో పాటు అమ్మడు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. మీరు ఒక లుక్ వేయండి..