ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయమా అందరికి తెలిసిన విషయమే. దీనినే సాకుగా తీసుకున్న పాకిస్తాన్ భారత్ పై ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తుందని. ఇప్పటికే దక్షణాది రాష్ట్రాలలోకి ఉగ్రవాదులను పంపిస్తుందని సమాచారం కూడా ఉంది. మరోపక్క కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తుంది. మే నెలలో జరిగిన ఐఖ్యరాజ్య సమితి లో జేఈఎం నాయకుడు అజార్ అంతర్జాతీయ ఉగ్రవాది అని తేల్చి చెప్పించి. అయితే ప్రస్తుతం అతడిని పాక్ రహస్యంగా విడుదల చేసింది. ఈ నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశం ఉన్నదున అల్లర్లు సృష్టించి ప్రపంచ దృష్టి కి వెళ్ళాలనే ఇలా చేస్తునారని సమాచారం. ఇక భారత్ విషయానికి వస్తే దక్షణాదే వారు టార్గెట్ చేసారని తెలియడంతో సైనుకులు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే బందోబస్తు పెంచారు. అంతేకాకుండా ఏపీలో సముద్ర తీరంలో కూడా పోలీసులను అలెర్ట్ చేయడం జరిగింది.
