కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక పక్క అందంతో .. మరో పక్క చక్కని అభినయంతో ఇటు కుర్రకారును.. అటు ఫ్యామిలీ ఒరియేంటేడ్ అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మూడు పదుల వయస్సు లో ఉన్న కానీ అమ్మడుకు ఏ మాత్రం అందం చెక్కు చెదరలేదు.
తెలుగు ఇండస్ట్రీలోనే అన్ని కలుపుకుని రూ. 2 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్. అయితే అమ్మడు అంతోద్దు అంటుంది అంట.
అది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అవకాశం అమ్మడు తలుపు తట్టింది అంట. అంతే బాలీవుడ్లో ఎంట్రీకోసం ముప్పై లక్షలు ఇచ్చిన ఒకే అని ఆ చిత్రం నిర్మాతకు గ్రీన్ సిగ్న ల్ ఇచ్చింది అని ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. అయితే ఈ హింది మూవీలో జాన్ అబ్రహం పక్కన అమ్మడు ఆడిపాడనున్నది.