నేచురల్ స్టార్ నాని, ప్రియాంక ఆరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్.ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అయిన ఖర్చు 28కోట్లు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే కనీసం 30కోట్లు కలెక్షన్లు రావాల్సిందే. అలా రావాలి అంటే ఈ చిత్రం మొదటిరోజు నుండే సూపర్ హిట్ రావాలి. మొదటిరోజు ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఆసలు వదులుకోవడమే. కానీ ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ మరియు హీరో నానికి చాలా ముఖ్యమని చెప్పాలి. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే.