యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోయింది. స్టీవ్ స్మిత్ తనదైన శైలిలో మరోసారి ముందుండి నడిపించాడు. అద్భుతమైన బ్యాట్టింగ్ తో 211, 82 పరుగులు సాధించాడు. ఇటు బ్యాట్టింగ్ లో స్మిత్ ఉంటే మరోపక్క పేసర్ పాట్ కమ్మిన్స్ బాల్ తో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఈ టెస్ట్ తరువాత అటు బ్యాట్టింగ్ లో స్మిత్, బౌలింగ్ లో కమ్మిన్స్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం సాదించారు. స్మిత్ 937 పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. టీమిండియా సారధి కోహ్లి 34 పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లికి మ్యాచ్ లు లేవు, స్మిత్ కి మాత్రం ఇంకొక మ్యాచ్ ఉంది. ఇందులో రానిస్తే రికార్డులు బ్రేక్ అవ్వొచని తెలుస్తుంది.
