సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నచ్చడం లేదని హోంశాఖ మంత్రి మేకతోట సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో పల్నాడులో ఏదో జరిగిపోతుందంటూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలించిన ఐదేళ్లలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందన్నారు. సచివాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి సుచిరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. లాండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుంది.. నేరాల సంఖ్య బాగా తగ్గింది.
ఇలా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు నచ్చడం లేదు. అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో పల్నాడులో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని డ్రామాలాడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు గ్రామాలు సందర్శించారు. ఎక్కడా అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. శిబిరాలకు కూడా పోలీసులను పంపిస్తున్నాం. ఎక్కడైనా నిజంగా భయానకం ఉంటే పోలీస్ ప్రొటెక్షన్‌తో ప్రజలను గ్రామాలకు తీసుకెళ్తామన్నారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు లాండ్ ఆర్డర్ గాలికొదిలి వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. గురజాలలో యరపతినేని అక్రమ మైనింగ్ చేస్తున్నాడని గురువాచారి అనేవ్యక్తి కంప్లైంట్ ఇస్తే అతన్ని వారంరోజులు చిత్రహింసలకు గురిచేశారు.
ఇలాంటి దుర్మర్గమైన పాలన చేసిన చంద్రబాబు ఇపుడు సీఎం జగన్ ప్రభుత్వంపై అవాకులు పేలడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలకు భంగం కలిగడంలేదు. పల్నాడు ప్రశాంతంగా ఉందన్నారు. కులాలు, ప్రాంతాలు చూడొద్దు సంక్షేమం అనేది ప్రధానమన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని సుచరిత చెప్పారు. పోలీస్ డిపార్టుమెంట్‌ను కూడా కించపరిచేలా మాట్లాడడం చంద్రబాబుకు తగదని హెచ్చరించారు. అయితే దీనినిబట్టి రేపు చంద్రబాబు పల్నాడుకు వస్తే హోంమంత్రిగారి మాటల్ని బట్టి చంద్రబాబు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కచ్చితంగా అరెస్ట్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. చలో ఆత్మకూరులో చంద్రబాబు వ్యవహారశైలిని బట్టి హోంమంత్రి ఆదేశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.