ఏపీలో ఏర్పడిన వైఎస్ జగన్ సర్కార్ వందరోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. వందరోజుల్లోనే జగన్ అన్నీ చేసేయాలని ఆశించడం లేదు కానీ సర్కారు బాధ్యతాయుతంగా అందర్ని కలుపుకుని ముందుకెళ్లాలని సూచనలిచ్చారు. పాలనకు వందరోజుల పాలన సూచికగా నిలుస్తున్నా సర్కార్ సరైన దిశలో పనియంచడం లేదని విమర్శించారు.. దీర్ఘకాల అభివృద్ధికి అనుగుణంగా సర్కారు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కోరారు.. జగన్ పాలన ఇలా ఉంటే సీఎం జగన్ వ్యవహారిస్తున్న తీరుమాత్రం సరిగ్గా లేదని, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా వ్యవహించాలని కోరారు. అందరిని కలుపుకుని ముందుకెళ్లాలనేది మాత్రమే తన అభిలాషగా చెప్పారు.
