సీఎం జగన్ పాలనకు 100 మార్కులంటున్నారు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఒకప్పుడు ఇదే జేసీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై ఎన్నో ఆరోపణలు చేసారు. అనుభవం లేదని విమర్శించారు. కానీ వందరోజుల పాలనతో తానేంటో నిరూపించారు యువ ముఖ్యమంత్రి జగన్.. తనను విమర్శించిన వాళ్లతోనే జయహో జగన్ అనిపించుకున్నారు. సంక్షేమ పథకాలు, అవినీతి అరికట్టడం, ప్రభుత్వ పాలసీలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, క్రమబద్ధమైన పరిపాలన ఇలా ప్రతీ అంశంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. టీడీపీ ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేసినా ప్రజా సమస్యలు, పాలన తప్ప మరో అంశంపై జగన్ వెళ్లలేదు.
ఈ నిబద్ధతే గతంలో తిట్టిన నోళ్లతో పొగిడిస్తోంది. అందరూ మెచ్చేలా పాలనచేసి చూపుతానంటూ జగన్ ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాటను నిజంచేసి చూపించుకున్నారు. జేసీ మాత్రమే కాదుజగన్ నిర్ణయాలను చూసి తొలి అసెంబ్లీ సమావేశంలోనే చాలామంది ఫిదా అయిపోయారు.. వారిలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఒకరు.. అడకుండానే వరాలిచ్చే దేవుడు జగన్ అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొలి బడ్జెట్ లో 10లక్షలు కేటాయించడంపై హర్షం వ్యక్తంచేసారు. ప్రజలంతా జగన్ ను ఇంతలా ఎందుకు అభిమానిస్తారో ఇప్పుడే అర్థమైందన్నారు..
ప్రత్యర్థ పార్టీకి చెందిన శాసన సభ్యుడు కూడా అభినందించేలా జగన్ పాలనా తీరు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. పథకాల అమలులో కులం, మతం, పార్టీ చూడం అంటూ జగన్ చెప్పినట్టుగానే పాలన సాగుతోంది. ఉద్యోగాల కల్పనలో అతిపెద్ద విప్లవం, ఉద్యోగులకు జీతాల పెంపు, పింఛన్ల పెంపు వంటి విధానాలతో జగన్ సర్వత్రా మెప్పు పొందుతున్నారు. జగన్ పై పెట్టిన కేసు అక్రమమేనని గతంలో విచారణ చేసి జనసేనలో చేరిన ఈడీ జేడీ స్వయంగా ఒప్పుకున్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చంద్రబాబే కాంగ్రెస్ ను ఎదిరించినందుకే సోనియానే జగన్ పై కుట్రలు చేసిందని బైటపడ్డారు. ప్రజాతీర్పులో బలం, ప్రజా సంకల్పం కలిస్తే జగన్ ప్రభుత్వంలా ఉంటుందంటున్నారు. జగన్ నాయకత్వం రానున్న రోజుల్లో ఆదర్శవంతమైన పాలనతో మరింత సంక్షేమంతో ముందుకెళ్తుందని వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చారని ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారు.