గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని మొదటినుంచీ వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఏర్పడిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై పీపీఏలపై సమీక్ష కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై కేంద్రమంత్రి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ తాను అనుకున్న విషయంలో ఎవరి మాట వినరని, కేంద్రం చెప్పినా వినడం లేది చెప్పారు. గతంలో పవర్ ప్రాజెక్టులపై జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారనికేంద్ర మంత్రి ఆర్కే సింగ్ విమర్శించారు.
విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని తాము భావించామని, కానీ జగన్ సరైన ఆధారాలు లేకుండానే పీపీఏలను రద్దు చేయాలని కోరుతున్నారని ఆయన చెప్పారు. కేంద్రం కూడా ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినిపించుకోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగాయంటూ సాక్ష్యాధారాలతో సహా విపక్షనేతగా ఉన్నపుడే జగన్ ఢిల్లీకి వచ్చారని ఆర్కే సింగ్ తెలిపారు. పవర్ ప్రాజెక్టులపై జగన్ వెనక్కి తగ్గేటట్టు లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
తామంతా జగన్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేశామని, త్వరలోనే ఈ పీపీఏల వివాదం సద్దుమణుగుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. జగన్ మొండివాడంటూ కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. అయితే గతంలో అధికారంలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి దాదాపుగా జరిగిన అవినీతి వ్యవహారాల్లో వారి పాత్ర కూడా ఉన్నందున ప్రస్తుతం కేంద్రం చంద్రబాబుపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది.