సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్‌లెట్స్ ఉంటాయి..ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం స్రవించినప్పుడు, ఆ రక్తాన్ని గడ్డకట్టేలా, గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతే తీవ్రమైన పూర్తి నీరసంతో కూడిన డెంగీ జ్వరం, బీపీ, హార్ట్‌ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో డాక్టర్లు ఐసీయూలకు తరలించి ప్లేట్‌లెట్స్ ఎక్కించి వేలకు వేలు చార్జీలు వసూలు చేస్తారు. అయితే డైలీ 9 రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గకుండా చూసుకోవచ్చు.
మరి ఆ 9 రకాల ఉత్తమ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
రక్తంలో ప్లేట్‌లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు
*******************************************************
1. బీట్ రూట్
– ప్లేట్ లెట్స్ ను పెంచడంలో బీట్‌రూట్ బాగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.
2. క్యారెట్
క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తింటే
బ్లడ్‌లో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గకుండా ఉంటుంది.
3. బొప్పాయి
బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.
బొప్పాయితో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. డాక్టర్లు కూడా డెంగీ జ్వరం వచ్చినప్పుడు
ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరిగేందుకు బొప్పాయి ఆకు రసం, బొప్పాయి జ్యూస్ తీసుకోమని చెబుతారు.
4. వెల్లుల్లి
శరీరంలో నేచురల్‌గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే డైలీ వెల్లుల్లిని తినాలి.
డెరెక్ట్‌గా తినలేకపోతే కూరల్లో వెల్లుల్లిని తగిన మోతాదులో వాడితే మంచిది.
5. ఆకుకూరలు
శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న
ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఆకుకూరల్లో ఉండే ఐరన్, కాల్షియం రక్తంలో
ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతాయి.
6.. దానిమ్మ
ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్స్
కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.
7. ఆప్రికాట్
ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో ఆప్రికాట్ ఒకటి. రోజుకు రెండు సార్లు ఆప్రికాట్‌ను
తినడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.
8.కిస్‌మిస్
రుచికరమైన ఈ డ్రై ఫ్రూట్‌లో 30శాతం ఐరన్ ఉంటుంది. డైలీ ఒక గుప్పెడు
కిస్‌మిస్ వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను నేచురల్‌గా పెంచుతుంది.
9. ఎండు ఖర్జూర
ఎండు ఖర్జూరలో కూడా ఐరన్ , ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి
నేచురల్ గా ప్లేట్‌లెట్స్ కౌంట్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
చూశారుగా… డైలీ ఈ ఆహారపదార్థాలు తీసుకోండి..రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోకుండా ఉంటాయి. తద్వారా డెంగ్యూ ఫీవర్ వంటి ప్రాణాంతక వ్యాధి రాకుండా ముందుగా జాగ్రత్తపడవచ్చు. ఓకేనా