తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని ఆదేశించారు. కాగా తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళ సై సౌందర్ రాజన్‌కు కూడా మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని కేసీఆర్ తెలియజేశారు. కేబినెట్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు, మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌లకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. కాగా కేబినెట్‌లో కొత్తగా ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందనే దానిపై ఈ మధ్యాహ‍్నానికి స్పష్టత రానుంది. కాగా ప్రస్తుత కేబినెట్‌లో ఒకరు లేదా ఇద్దరిని తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి మంత్రివర్గం నుంచి తప్పించేవారి పేర్లు బయటకు రాలేదు. మొత్తంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
