తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో కొత్త గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్‌రావు, స్పీకర్ పోచారం, మంత్రులు, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ సంతోష్ తదితర నేతల పాటు…హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి, తెలంగాణ స్పీకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ సౌందర్ రాజన్ తన తండ్రికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన అల్పాహర విందులో నేతలందరితోపాటు సీనియర్ నటీ రాధిక, ఆమె భర్త శరత్‌కుమార్‌లు కూడా పాల్గొన్నారు.
