ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా నిన్న కోల్కతాలో దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ కి బ్రేక్ వేసింది హర్యానా. నవీన్ కుమార్ ఉన్నప్పటికీ ఎప్పటిలానే తన ఫామ్ ని కొనసాగించి, సూపర్ టెన్ సాధించాడు. అయినప్పటికీ డిఫెన్స్ లోపం వళ్ళ భారీ తేడాతో ఓడిపోయారు. హర్యానా లో రైడర్స్ వికాస్ కండోలా, ప్రశాంత్ రాయ్ అద్భుతంగా రాణించారు. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్, గుజరాత్ సూపర్ జైంట్ తలపడగా ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
