గత ఐదేళ్లపాలనలో యరపతినేని శ్రీనివాసచౌదరి అక్రమ మైనింగ్ లో చెలరేగిపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించినవారిపై అక్రమకేసులు బనాయించారు. చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించారు. అయితే ఈ ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గ దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారు. పిడుగురాళ్లలోని వాసవి కల్యాణ మండపంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకుల నుంచి దాడులకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఇతర వర్గాలను ప్రజలను హోం మంత్రి సుచరిత శనివారం పరామర్శించారు. ఈ కార్యక్రమానికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
పార్టీలకతీతంగా వందలమంది ఈ కార్యక్రమానికి హాజరై తాము పడ్డ కష్టాలు, బాధలను హోంమంత్రికి తెలియజేశారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారని బాధితులు చెప్పుకున్నారు. తన, మన అనే బేధాలు లేకుండా యరపతినేని దోచుకున్నారని బాధితులు ఆరోపించారు. తమ మైనింగ్ క్వారీని యరపతినేని అనుచరులు కబ్జాచేస్తే అధికారులు పట్టించుకోలేదని, మైనింగ్‌క్వారీ విషయంలో యరపతినేని అనుచరుల వేధింపులు తట్టుకోలేక ఒకానొక సందర్భంలో తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొందరు వివరించారు. ఇదే తరహాలో అనేక మంది బాధితులు యరపతినేని, ఆయన అనుచరుల అరాచకాలను, వేధింపులను గుర్తు చేశారు. అయితే యరపతినేని , ఆయన అనుచరుల వేధింపులకుగురైన బాధితుల కష్టాలు, బాధలు విన్న హోంమంత్రి వారికి భరోసానిచ్చారు.
ఈ కేసులపై పునఃవిచారణ చేపడతామని, ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని భరోసా ఇచ్చారు. గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్‌రావు బందిపోట్లులా అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్‌లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. చాలామందిని హింసించారని, అక్రమ మైనింగ్ ద్వారా లోకేశ్ అండతో కోట్లు సంపాదించారని సమాచారం.. ఈ పాపాలలో, అక్రమ సంపాదనలో లోకేశ్ కు పెద్దఎత్తున ముడుపులు అందాయని వీరికి అడ్డొచ్చిన వారిని లోకేశ్ అండతోనే హింసించారని స్థానికులు చెప్తున్నారు. విచారణ జరిపి యరపతినేనితోపాటు ఈ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న లోకేశ్ ను సైతం అరెస్ట్ చేయాలని గురజాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.