రాష్ట్ర ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని రూ.200 కోట్ల విలువ చేసే 5.10 ఎకరాల భూమిని మింగేసిన విషయం వెలుగుచూసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డు పక్కన గల మధురానగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఈ భూమిని వారి ఖాతాలో వేసుకున్నారు. న్యాయస్థానాలకు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్ చేసి భారీగా లబ్ధి పొందారు. ఈ విషయం ఇటీవల స్పందన ద్వారా వెలుగు చూసింది. 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద మిగులు భూమిని కోల్పోకుండా కుటుంబరావు కుటుంబం రైల్వేశాఖకు ఆభూమిని ఇస్తూ రెవెన్యూశాఖ సహాయంతో పరిహారం పొందాలని భావించాడు.. రైల్వే ఉద్యోగులకు స్టాఫ్ క్వార్టర్లు, ఎలక్ట్రికల్ ట్రెయినింగ్ స్కూల్ కి సంబంధించి విజయవాడలో స్థలం అవసరమైంది.
దీనికి సంబంధించి రెవెన్యూశాఖ భూ సేకరణకు అనుమతించింది. 1980లో 22 ఎకరాల భూసేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రచురితమైంది. అయితే ఈలోపు 18ఎకరాలను రైల్వేశాఖ తీసుకుంది. రైల్వేకి అప్పగించిన ఈభూమిలో కుటుంబరావు చెందిన భూమికూడా ఉండేలా చూసుకున్నారు. మధురానగర్ రైల్వే స్టేషన్, కేంద్రీయ విద్యాలయం, రైల్వే క్వార్టర్స్‌ను ఆనుకుని ఉన్న రైల్వే భూమి. ఇది మిగులుభూమి కాబట్టే ఎన్‌వోసీ ఇవ్వట్లేదని ఆయాశాఖల అధికారులు కోర్టుకు స్పష్టంగా చెప్పినా సాక్ష్యా ధారాలు అందించలేకపోయారు. దీంతో కుటుంబరావు కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు 1997లోనే డైరెక్షన్ ఇచ్చింది. ఇది మొత్తం మిగులుభూమి అని, రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లగా సదరు తీర్పును సమర్దించింది. అయితే ఆభూమి తమకు అవసరంలేదని, ప్రభుత్వము స్వాధీనం చేసుకోవచ్చని 2012 లో రైల్వేశాఖ కోర్టుకు తెలిపింది. అప్పుడే ఈభూమి మాదేనన్న ప్రభుత్వం మిన్నకుంది.
ఈ నేపథ్యంలో 2018లో రైల్వేశాఖ 5.10 ఎకరాలను కుటుంబరావుకు అప్పగించింది. ఈవ్యవహారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరగాలి కానీ రైల్వే శాఖే నేరుగా భూమిని వ్యక్తులకు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. దీనివెనుక సీఎం చంద్రబాబు ఆదేశాలున్నాయని ఆర్‌డీఓ, తహశీల్దారు కార్యాలయాల ఉద్యోగులు చెబుతున్నారు. ఇతగాడి బండారం బయటకు రావడంతో అందరూ నివ్వెరపోతున్నారు. కుటుంబరావు 200కోట్ల విలువ చేసే 5ఎకరాల భూమి నొక్కేసిన ఉదంతం బయటకు రావడంతో ఇతను ప్రముఖ టీవీ చానల్ లో స్టాక్ బ్రోకర్ గా సలహాలు ఇస్తూండేవాడు, తరువాత చంద్రబాబు సీఎం అయినాక రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చేసాడని, గతంలో వివిధ టీవీ చర్చల్లో రెండుసార్లు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ని జగన్ ‘గారు’ అని కాదు జగన్ ‘గాడు’ అని పిలవాలనిపిస్తోందంటూ ఇష్టానుసారంగా కుల అహంకారంతో మాట్లాడిన కుటుంబరావు అతి త్వరలో ఊచలు లెక్క పెడతాడంటూ అమరావతి స్థానికులు చెప్పుకుంటున్నారు.