యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. వారంరోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 370 కోట్లకు పైమాటే. ఇదే ఊపూ కొనసాగితే 500 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం కొట్టి తీసిన సినిమా అని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హాలీవుడ్ లో జెరోమ్ సల్లే దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘లార్గో వించ్’. దీని నుంచి కాపీ కొట్టారని, పోనీ కాపీ కొట్టి సినిమా మంచిగా తీశారా అంటే అదీ లేదని ట్వీట్ చేసారు.
అయితే సినిమా రిలీజ్ అయిన వారంరోజుల్లో ఎక్కడా మీడియా ముందుకు రాని డైరెక్టర్ సుజీత్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి.. సినిమా కాపీ విషయంపై వెరైటీగా స్పందించాడు. మీరు కాపీ అని చెబుతున్న సినిమా ఇంతవరకు నేను చూడలేదని, ఈ చిత్రం నా సొంత కధ అని అన్నారు. అంతేకాకుండా సినిమా అర్ధం కాకపోతే మరోసారి చూడండి గాని ఇలా తప్పుడు రివ్యూలు ఇవ్వకండి అని చెప్పడంతో ఒక్కసారిగా నెటీజన్లు సుజీత్ పై విరుచుకుపడ్డారు. ఇది అలా ఉంటే ఈ చిత్రం హిందీలో మంచి పేరు వచ్చిందని, బీహార్ వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారని, నేనే కనుక అక్కడ పుడితే నా విగ్రహం పెట్టేవారని అన్నాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో సుజీత్ ఓవర్ చేస్తున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.