Home / ANDHRAPRADESH / సంచలనం..చంద్రబాబును కలిసిన తర్వాతే.. కొండపై చర్చి అంటూ పోస్టులు పెట్టాం.. పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి..!

సంచలనం..చంద్రబాబును కలిసిన తర్వాతే.. కొండపై చర్చి అంటూ పోస్టులు పెట్టాం.. పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి..!

ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సోషల్ మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో టీడీపీ సోషల్ మీడియా విభాగం పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపింది. వరదల నేపథ‌్యంలోరైతు వేషంలో జగన్ని, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ని కులం పేరుతో దూషించిన ఘటనలో గుంటూరుకు చెందిన శేఖర్ చౌదరి అనే పెయిడ్ ఆర్టిస్టులతో పాటు, మరో నలుగురిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక తిరుమలలో కూడా జగన్‌పై దుష్ప్రచారం చేసేందుకు టీడీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. తొలుత తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ యాగీ చేసిన టీడీపీ సోషల్ మీడియా..ఆ టికెట్లు బాబు హ‍యాంలోనే ముద్రించబడ్డాయని తేలడంతో లోకేష్ టీమ్‌కు రివర్స్ అయింది. అయినా మళ్లీ మళ్లీ తిరుమల తిరుపతి ప్రతిష్ట దిగజారేలా టీడీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన వారు పోస్టులు పెడుతున్నారు. ఇటీవల శేషాచలం కొండలపై చర్చి అంటూ దుష్ప్రచారం చేసిన ముగ్గురు టీడీపీ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసినవారిలో హైదరాబాద్‌కు కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కాటేపల్లి అరుణ్‌కుమార్‌, హైదరాబాద్‌కు చెందిన గరికపాటి కార్తీక్‌, మిక్కినేని సాయిఅభితేజ్‌లు ఉన్నారు. టీటీడీ ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

తిరుమలలో చర్చిలు ఉన్నాయంటూ వీరు అసత్యవార్తలు ప్రచారం చేస్తున్నారని ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు ఈ కేసులో నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తిరుమలలో అన్యమత ప్రచారం అంటూ జరుగుతున్న దుష్ప్రచారం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో పట్టుబడిన నిందితులంతా కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైందని విశ్వసనీయ సమాచారం. తిరుమలలో చర్చి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కాటేపల్లి అరుణ్‌కుమార్, కార్తీక్, సాయి అభితేజ్‌లను స్వయంగా టీడీపీ పొలిటికల అడ్వయిజర్ ఈతకోట్ జయప్రకాశ్ తీసుకెళ్లి చంద్రబాబుకు పరిచయం చేసినట్లు తెలుస్తోంది. బాబుతో భేటీ తర్వాత ఈ ముగ్గురు తిరుమలలో అన్యమతప్రచారం..శేషాచల కొండల్లో చర్చి అంటూ.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రాబట్టిన ఆధారాల మేరకు పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. మొత్తంగా శేషాచల కొండల్లో చర్చి అంటూ జరిగిన దుష్ప్రచారం వెనక టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఉన్నట్లు, చంద్రబాబును కలిసిన తర్వాతే తిరుమలలో అన్యమత ప్రచారం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. మరి ఈ కేసు చంద్రబాబు, లోకేష్‌ల మెడకు చుట్టుకుంటుందో లేదో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat