నాపై నమ్మకం ఉంచి మరోసారి మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయడానికి మంత్రిగా మరోసారి అవకాశం దొరికిందన్నారు. ఈసందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించన సిరిసిల్ల నియోజవకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. తనకు అభినందనలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి తనను కలవడానికి వచ్చే వారికి ఓ విన్నపం చేశారు కేటీఆర్. నా వద్దకు వచ్చేటపుడు బోకేలు, శాలువాలు తీసుకురావద్దని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటినా, సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చినా ఎంతో సంతోషిస్తానని తెలిపారు.
Some more pics from Raj Bhavan today
Many thanks all for the greetings & messages. Humble appeal to well wishers & party leaders not to bring in any bouquets or shawls when u come in person to greet
Instead request you to plant a sapling or donate to CMRF as much as you can ? pic.twitter.com/ysOILbUw3p
— KTR (@KTRTRS) September 8, 2019