మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అందరు రాజకీయ నాయకులు అనుకొంటారు.
అయినా అన్నీ చేయరు.. ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, చాలాసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేకపోయాయి.. అయితే తన ప్రమాణస్వీకార సభలో జగన్ తాను రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖుతో జగన్ పాలనకు వందరోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల్లో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసారు. ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా (ఈ ఏడాది అక్టోబర్ నుంచే) రూ.12,500. విడతల వారీగా రూ.50 వేలు చెల్లించేందుకు నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్‌లో మాత్రమే ఇస్తారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేని రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైతులకు ఉచితంగా 200 రిగ్గు బోర్లు. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా.
ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కు తగ్గింపు.
గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు.
ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం.
ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు. అవసరం మేరకు çఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.
భూ యాజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు 11 నెలలు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా కౌలుదార్ల చట్టం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించే ఏర్పాటు.
జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయం. గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రణాళిక.
సీఎం చైర్మన్‌గా వ్యవసాయ మిషన్ ఏర్పాటు.
రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైఎస్సార్ ఉచిత బీమా పథకం.
2018 ఖరీఫ్‌లో కరువుకు సంబంధించి రైతులకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల.
ధాన్యం సేకరణకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించడానికి చర్యలు. రూ.360 కోట్లు విడుదల.
కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున రూ.300 కోట్లు బోనస్‌గా విడుదల.
ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల.
నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కోసం చర్యలు.
తొలి ఏడాదే సహకార రంగ పునరుద్ధరణకు చర్యలు.
గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించిన రూ.384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు.
వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్‌పుట్ సబ్సిడీ.
పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం.
కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం. సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం. నాఫెడ్ సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ సెస్ రద్దు. ఫలితంగా క్వింటాల్ రూ.8,500కు పెరిగిన కొబ్బరి ధర. కొబ్బరి పంటల బీమా ప్రీమియంలో 75 శాతం కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం.