మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అందరు రాజకీయ నాయకులు అనుకొంటారు. అయినా అన్నీ చేయరు.. ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, చాలాసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేకపోయాయి.. అయితే తన ప్రమాణస్వీకార సభలో జగన్ తాను రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖుతో జగన్ పాలనకు వందరోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల్లో ప్రజారోగ్యానికి జగన్ ప్రాధాన్యతనిచ్చారు.
► ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలుకు శ్రీకారం చుట్టారు.. రూ.1000 బిల్లు దాటినట్టయితే, వార్షిక ఆదాయం రూ.5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికి పథకం వర్తించేలా చేసారు. మొత్తం 2031 జబ్బులకు ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా వర్తించేలా చట్టం చేస్తున్నారు.
► అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తూ కొత్త వాహనాలు కొనుగోలు చేసారు.
► రెండేళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు.
► శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, చుట్టుపక్కల గ్రామాల కిడ్నీ బాధితుల కోసం.. 200 పడకలతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులిస్తూ రూ.50 కోట్లు తక్షణ కేటాయించారు
► డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు (అక్టోబరు 10 నుంచి అమలు) కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు
► రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు
► విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడపలో క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులు ప్రారంభిస్తున్నారు.
► పాడేరు, విజయనగరం, పల్నాడులో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.