ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లపై చీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి 5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎకసెక్కాలాడుతున్నారు. అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా? లక్షల మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించిన వలంటీర్ సైనికులకు ఏం తక్కువని మీరలా అపశకునాలు పలుకుతున్నారు?అని ప్రశ్నించారు.