బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లో గొడవలు.. కామెడీ సీన్స్.. రొమాన్స్ కనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. ముందు వితికా.. రాహుల్ ని ‘నీకు నిజంగా పునర్నవి మీద ఫీలింగ్స్ లేవా..?’ అని ప్రశ్నించింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో రాహుల్.. పునర్నవికి ప్రపోస్ చేశాడు. వరుణ్, వితికతో కలిసి వీళ్లిద్దరూ మీటింగ్ పెట్టారు. రాత్రి పడుకునే ముందు వరుణ్, వితికా, రాహుల్, పునర్నవిల మధ్య ఒక టాపిక్ నడిచింది. వితిక.. నీకు నిజంగా పునర్నవి మీద ఫిలింగ్స్ లేవా అని రాహుల్‌ను ప్రశ్నించింది. దీనికి తనకు పున్ను అంటే ఇష్టం అని సమాధానం ఇచ్చాడు. కానీ, దీని వెనుక వేరే ఉద్దేశం లేదన్నాడు. అదే సమాధానం పునర్నవి కూడా చెప్పింది. ఈ సమయంలోనే రాహుల్.. పునర్నవి వైపు తిరిగి ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడు. దీనికి పునర్నవి ఏమీ సమాధానం ఇవ్వలేదు. కానీ, వరుణ్ సందేశ్ మాత్రం ఆమెను గుచ్చి గుచ్చి అడిగాడు. దీంతో ‘నాకు ఇప్పటికే లవర్ ఉన్నాడు. మేమిద్దరం ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నాము’ అని చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. లవ్ లో ఉన్నా అని చెప్పింది. ఇక ఆ లవర్ ఎవరు అంటూ తెగ వెతికేస్తున్నారు. ఇండస్ట్రీలోనా, ఊర్లోనా, లేక బంధువుల్లో ఎవరైన అంటూ హల్ చల్ చేస్తున్నారు.