నయనతార…దాదాపు 16నెలలు తర్వాత, ఈ ముద్దుగుమ్మ సైరా నరసింహారెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో మెగాస్టార్ తో జంటగా నటిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ చిత్రానికి గాను ఈమే 6కోట్లు తీసుకుంటుందట. నయనతార ప్రస్తుతం తమిళ్ లో నటించిన సినిమాలు అన్నీ కూడా సెన్సేషన్ హిట్స్ అనే చెప్పాలి. మరి ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో మరోసారి తన ప్రతిభను చాటనుంది. ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతారను చూసి అందరు షాక్ అవుతున్నారు.
