నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు నాలిక మందం అన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు ప్రసంగాల్లో తత్తరపాటుతో అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు అంటూ చెప్పినా..ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీనే అవునా కాదా అంటూ సొంత పార్టీ కార్యకర్తలను ముందు నోరుజారినా.. డెంగ్యూ వ్యాధిని బూతు అర్థం వచ్చేలా మాట్లాడినా …అది లోకేష్‌కే చెల్లింది. . ఈయనగారి భాషా పాండిత్యానికి భయపడిన తెలుగు తమ్ముళ్లు..ఎన్నికల సమయంలో తమ నియోజకవర్గాలకు చినబాబును పంపించవద్దంటూ ఏకంగా చంద్రబాబుకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. బాబుగారు తన వారసుడిగా లోకేష్‌ను జనాలపై ఎంతగా రుద్దాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. తెలివతక్కువతనం, తెలుగు స్పష్టంగా మాట్లాడకలేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం చినబాబుకు మైనస్‌గా మారింది. స్వయంగా చంద్రబాబు లోకేష్‌కు తెలుగు భాషపై నేర్పించేందుకు ట్యూషన్ పెట్టించినా ఫలితం లేకుండా పోయింది. లోకేష్ మైక్ పట్టుకుంటే చాలు..భాషను ఖూనీ చేస్తూ..పార్టీ పరువు తీసేలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ..ప్రత్యర్థులకు దొరికిపోతున్నాడు.
తెలుగులో సరిగా మాట్లాడడం లేకపోవడమే కాదు..లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు కూడా శూన్యం. ఆఖరికి ప్రసంగాల్లోనే కాదు..ట్విట్టర్‌లో కూడా అర్థంపర్థం లేని ట్వీట్లు పెడుతూ ఎన్నోసార్లు నెట్‌జన్లకు దొరికిపోయాడు లోకేష్. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమికి లోకేష్ ప్రసంగాలు, ట్వీట్లు కూడా ఓ కారణం అంటే అతిశయోక్తి కాదు. కనీస తెలుగు స్పష్టంగా మాట్లాడలేని లోకేష్‌ను భావి సీఎంగా ప్రమోట్ చేయడాన్ని ఏపీ ప్రజలు అంగీకరించలేదు. ఇక ప్రతిపక్షంలో ఉన్నా లోకేష్ మారలేదు. మళ్లీ తనదైన స్టైల్లో కనీస అవగాహన లేకుండా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై పోస్టులు, ట్వీట్‌లు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నాడు. ఇటీవల వరద ముంపు నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వైసీపీ నేతలు చిన్నపడవను అడ్డుపెట్టి మా ఇంటిని ముంచేస్తున్నారంటూ లోకేష్ పెట్టిన పోస్ట్ హాస్యాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో తాను చేసే పోస్టులు, ట్వీట్‌లు తనకే రివర్స్ అవుతున్నా లోకేష్ మాత్రం మారడం లేదు. చినబాబు భాషాపాండిత్యానికి భయపడిన చంద్రబాబు ఆ మధ్య లోకేష్‌ను ఇంటికే పరిమితం చేశాడు. అయితే ఈ మధ్య అడపాదడపా బయటకు వస్తూ… లోకేష్ తనదైన స్టైల్లో నోరుజారుతూ..పరువు తీసుకుంటున్నాడు.
తాజాగా సీఎం జగన్‌పై మాట్లాడుతూ..మరోసారి బుక్కైపోయాడు. రాజన్న రాజ్యాన్ని తెస్తామని చెప్పిన జగన్‌మోహన్ రెడ్డి రాక్షస రాజ్యాన్ని తెచ్చారు అంటూ..తనదైన స్టైల్లో ప్రాసలో చెప్పానని..లోకేష్ మురిసిపోయాడు. అంటే సీఎం జగన్ రాజన్న రాజ్యం తేలదంటూ పరోక్షంగా లోకేష్ బాధపడిపోయినట్లైంది. రాజన్న రాజ్యాన్ని తాము వ్యతిరేకిస్తామని, కానీ చినబాబు మాత్రం రాజన్న రాజ్యం తేలేందంటూ బాధపడేలా మాట్లాడుతున్నారంటూ…కొందరు తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం “మనోడు ఏం మారలేదంటూ..అదే కామెడీ..” అంటూ లోకేష్ వ్యాఖ్యలపై కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. రాజన్న రాజ్యం వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా లోకేష్‌కు క్లాస్ పీకినట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడి పార్టీ పరువు తీసిన చినబాబు, ప్రతిపక్షంలోనూ అదే తీరును కొనసాగిస్తూ ప్రత్యర్థులకు దొరికిపోవడం పట్ల టీడీపీ నేతల్లో అసహనం వ్యక్తమవుతుంది. చినబాబు ఒక్కడు చాలు పార్టీని పూర్తిగా బొందపెట్టడానికి అంటూ తెలుగు తమ్ముళ్లు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. ఇక లోకేష్ వ్యాఖ్యలపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రాజన్న రాజ్యం తేలేదంటూ బాధపడకు లోకేష్..ఆయన కొడుకు జగన్ ఉన్నాడులే అంటూ నెట్‌జన్లు చినబాబును చెడుగుడు ఆడేసుకుంటున్నారు. మొత్తంగా జగన్ రాజన్న రాజ్యం తేలేదంటూ అర్థం వచ్చేలా మాట్లాడిన లోకేష్ మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. అయినా మన పిచ్చికాని..బాబు మారడు..లోకేషూ మారడు..ఇద్దరూ దొందూ దొందే..వాళ్లు పండించే కామెడీని చూస్తూ ఎంజాయ్ చేయడమే ఏమంటారు.