Home / 18+ / 4లక్షల ఉద్యోగాలు, జగనన్న విద్యా దీవెన ద్వారా చేయూత, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

4లక్షల ఉద్యోగాలు, జగనన్న విద్యా దీవెన ద్వారా చేయూత, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అందరు రాజకీయ నాయకులు అనుకొంటారు.

 

అయినా అన్నీ చేయరు.. ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, చాలాసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేకపోయాయి.. అయితే తన ప్రమాణస్వీకార సభలో జగన్ తాను రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖుతో జగన్ పాలనకు వందరోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల్లో గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు వేసారు. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టి 4లక్షలకుపైగా ఉద్యోగాలిస్తున్నారు. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1లక్షా 27 వేల ఉద్యోగాలు ఉన్నాయి.
గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియామకం. వీరి ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టారు
కాపు కార్పొరేషన్‌కు తొలి బడ్జెట్‌లోనే రూ.2 వేల కోట్ల నిధులు.. 5 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం చేసారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణ. మద్యం దుకాణాల్లో 16 వేల ఉద్యోగాలు కల్పించారు
జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి పేదవాడి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు.
ఇంటర్‌ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు,,.. మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
దశలవారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్, టాయ్‌లెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, పెయింట్లు వేయించటం వంటి చర్యలతో పాఠశాలలన్నింటి రూపురేఖల్ని మార్చేందుకు బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయించారు.
ఉద్యోగాలకు ఉపయోగపడేలా చదువుల ప్రణాళికను మార్చాలని నిర్ణయం. తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరిగా ప్రతి స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నారు
పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శనివారం నో బ్యాగ్‌ డే ప్రవేశ పెట్టి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat