Home / 18+ / ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌, స్థానికులకు 75 శాతం, మద్య నియంత్రణ, లోకాయుక్త ఏర్పాటుకు కృషి

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌, స్థానికులకు 75 శాతం, మద్య నియంత్రణ, లోకాయుక్త ఏర్పాటుకు కృషి

మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు.

 

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అందరు రాజకీయ నాయకులు అనుకొంటారు. అయినా అన్నీ చేయరు.. ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, చాలాసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేకపోయాయి.. అయితే తన ప్రమాణస్వీకార సభలో జగన్ తాను రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖుతో జగన్ పాలనకు వందరోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల్లో కీలక బిల్లులు.. చట్టాల సవరణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

► కబ్జాలు, దందాలు, అవకతవకలకు విరుగుడుగా భూమి మీద నిజమైన హక్కు ఉన్న వారికి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ – 2019 బిల్లు ఆమోదం. అత్యాధునిక విధానంలో సమగ్రంగా భూముల సర్వే.
► రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ చట్టం సవరణ బిల్లు ఆమోదం.
► మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం. ఇందులో నలుగురు డిప్యూటీ సీఎంలు.
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు.
► శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు.
► ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
► పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు.
► దశల వారీగా మద్య నిషేధం దిశగా.. మద్య నియంత్రణ చట్ట సవరణ. బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేత. తగ్గిన మద్యం వినియోగం.
► ఆలయ పాలక మండళ్లలో (టీటీడీ మినహా) 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు.
► ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం.
► పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు బిల్లులు –2019కు ఆమోదం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat