తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లఘించే పోలీసులకు,నగర వాసులకు భారీ జరిమానా తప్పదని హెచ్చరికలు చేశారు.
అయితే మరి ముఖ్యంగా హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు ఎంత ఉన్నతస్థాయి ఉద్యోగైన సరే విధుల్లో ఉండి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వాహానసవరణ చట్టం 2019లోని సెక్షన్ 210-B ప్రకారం రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు..హైదరాబాద్ పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించవద్దు సూచించారు.