చంద్రుడిపై దిగడంలో విఫలమైనట్లు భావించిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ గురించి మీకు తెలుసా.. ?. ఈ ల్యాండర్ గురించి మీకు తెలియని విషయాలు.. ప్రత్యేకతలపై ఒక లుక్ వేద్దాం. ఆర్బిటర్ నుండి విడిపోయిన ల్యాండర్ చంద్రుడి ఉపరతలాన్ని స్కాన్ చేస్తుంది.
ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ల్యాండర్ 1471కిలోల బరువును కలిగి ఉంటుంది. అంతే కాకుండా 650వాట్ల విద్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. బెంగుళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ ,రోవర్,ఆర్బిటర్ తో కమ్యూనికేషన్ కొనసాగిస్తుంది. అయితే దీని జీవితకాలం మాత్రం కేవలం పద్నాలుగురోజులు(ఒక లూనార్ పగలు)మాత్రమే..