అక్కినేని ఫ్యామిలీ..ఏఎన్ఆర్. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించిన చిత్రం మనం. ఈ చిత్రం 2014 లో విడుదలైంది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యింది. అదే తరహాలో ఇప్పుడు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి మనం అంటే ఒక కుటుంబం కాబట్టి, ఆ ఫ్యామిలీ ఎవరూ అనే విషయానికి వస్తే అది మరెవ్వరో కాదు గట్టమనేని ఫ్యామిలీ. ఇటీవలే మహేష్ బాబుతో మహర్షి సినిమా తీసిన వంశీ..ఈ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మల్లా ఆ ఫ్యామిలీ లో సూపర్ స్టార్ కృష్ణ, మనవడు గౌతమ్ తో సినిమా తీయనున్నాడని సమాచారం. అయితే ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.