టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కైరా అద్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. . పసుపు రంగు దుస్తులను ధరించి దిగిన ఫోటో అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు కైరా పిక్ మీద నెటిజన్లు రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ రావడానికి కారణం ఆమె ధరించిన డ్రెస్ వెరైటీగా ఉండటమే. కైరా డ్రెస్‌ను చాలా మంది మాగీ నూడుల్స్‌తో పోల్చుతున్నారు. ఓ అభిమాని “మసాలా మాగ్గి” అంటూ కామెంట్ పెట్టారు. మరొకరు “మీరు మాగీని ఎక్కువగా ప్రేమిస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. “మాగీ ఇంతకు ముందు అంత బాగా కనిపించలేదు” అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు. మరొక నెటిజన్ “మీకు మాగీ మీద బోర్ కొట్టి ఇలా డ్రెస్ తయారు చేశారు అంటూ కామెంట్ పెట్టారు. ఇక కైరా సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ‘గుడ్ న్యూస్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జిత్ దోసంజ్‌లతో కలిసి నటిస్తోంది.