సుజిత్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు మారుమ్రోగుతున్న యువదర్శకుడి పేరు. ఆగస్టు నెల చివరలో విడుదలైన సాహో డైరెక్టర్ సుజిత్. ఈ మూవీ మొదట్లో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న కానీ ప్రస్తుతం బాక్స్ ఆఫీసులను కొల్లగొడుతూ ఏకంగా ఐదు వందల కోట్ల వసూళ్లకు చేరుకుంది. షార్ట్ ఫిల్మ్ లను తీసే స్థాయి నుండి మొత్తం రూ.350కోట్లు పెట్టి సినిమా తీసే స్థాయికెదిగిన దర్శకుడు సుజిత్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సాహో ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో సుజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వూలో మీరు తెరకెక్కించిన చిత్రం రన్ రాజా రన్ విడుదల తర్వాత హీరో ప్రభాస్ కోసం దాదాపు రెండేళ్లు ఎదురుచూశారు. ఆ ఎదురుచూసే బదులు మరో మూవీ తీయచ్చు కదా ..
తీరా సాహో తీసి విడుదలైనాటికి రెండేళ్లు పట్టింది మొత్తం నాలుగేళ్ళు.. ఈ నాలుగేళ్లల్లో ఎన్నో సినిమాలు తీయచ్చు కదా అని అడిగారు. దీనికి సమాధానంగా సుజిత్ మాట్లాడుతూ” ఏమిటి నేను తీసిన రెండు చిత్రాల మధ్య ఇంత గ్యాఫ్ వచ్చిందా..? ప్రభాస్ తో పరిచయమవ్వడం ఆయనతో కల్సి చేసిన జర్నీలో టైం తెలియలేదు. నేను తీసిన తొలి మూవీ రన్ రాజా రన్ పెద్ద హిట్టేం కాదు. ట్రెండ్ సెట్టర్ అసలే కాదు. కానీ డబ్బులోచ్చాయి. అంతకు అంత ఫేం కూడా వచ్చింది. అయితే ఆ వెంటనే జోనర్ మార్చాలని నాకు ముందే తెల్సు. నా లక్ లో ఈ గ్యాఫ్లో పెళ్ళి చూపులు,అర్జున్ రెడ్డి లాంటి మూవీలోచ్చాయి. కొత్తగా ఆలోచించగల్గే ధైర్యానిచ్చాయి. నన్ను ఈ రెండు మూవీలు సాహో ఎలా తీయాలో మార్చాయి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.