టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ముడో మ్యాచ్ జరిగింది. మొదట బ్యాట్టింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత ఓవర్లు లో 125 పరుగులు మాత్రమే చేసింది. ఇంక ఈ మ్యాచ్ కూడా శ్రీలంక ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మళింగ దెబ్బకు న్యూజిలాండ్ 88 పరుగులకే కుప్పకూలిపోయింది. నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 6పరుగులే ఇచ్చి ఒక మేడిన్ తో 5 వికెట్లు తీసాడు. అంతేకాకుండా ఇందులో హ్యాట్రిక్ కూడా తీయడం విశేషం.
