Home / TELANGANA / కేటీఆర్ కృషి…సిరిసిల్లలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు..!

కేటీఆర్ కృషి…సిరిసిల్లలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు..!

చేనేత ఖిల్లా..సిరిసిల్ల ఇక చదువుల ఖిల్లాగా మారబోతుంది..సిరిసిల్ల ప్రజల చిరకాల కోరికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెరవేర్చబోతున్నారు. నేతన్నల బిడ్డలకు ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా సిరిసిల్లలో జేఎన్‌టీయూకు అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలోని పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలకు తీసిపోని విధంగా అత్యున్నత ప్రమాణాలతో.. వచ్చే విద్యాసంవత్సరం(2020-21) నుంచే ఈ నూతన ఇంజనీరింగ్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల కమిటీ రూపొందించిన నివేదికను రెండు రోజుల్లో ప్రభుత్వానికి చేరనుంది. ఈ నేపథ్యంలో బుధవారం సిరిసిల్లలో పర్యటించిన కమిటీ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదించిన సుమారు 100 ఎకరాల స్థలాన్ని పరిశీలించింది. సిరిసిల్ల వద్ద ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు అన్నీ అనుకూలంగా ఉన్నాయని కమిటీకి నేతృత్వం వహిస్తున్న పాపిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే జేఎన్‌టీయూకు అనుబంధంగా హైదరాబాద్‌, మంథని, సుల్తాన్‌పూర్‌, జగిత్యాలలో ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలోనూ కాలేజీ ఏర్పాటైతే జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల సంఖ్య ఐదుకు చేరుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు అయితే సిరిసిల్ల ప్రాంత విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇంజనీరింగ్ కోసం జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌కు వెళ్లే అవస్థలు తప్పుతాయి. మొత్తంగా కేటీఆర్ కృషితో చేనేత ఖిల్లా సిరిసిల్ల ఇక..చదువుల ఖిల్లాగా రూపాంతరం చెందుతుందనడంలో సందేహం లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat