టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లలో ఎవరికివారు తమ సత్తా చాటుకుంటున్నారు. అంతేకాకుండా ముందుండి తమ జట్టుని నడిపిస్తున్నారు. ఇండియా పరంగా చూసుకుంటే కెప్టెన్ కోహ్లి తన బ్యాట్ కు పని చెబితే తనకంటే తోపు ఎవరూ ఉండరనే చెప్పాలి. కాని ప్రస్తుతం తన ఆట ఎలా ఉంది అంటే ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కనీసం టాప్ 5 లో కూడా లేడు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్కువ పరుగులు సాధించిన వారిలో స్టీవ్ స్మిత్ 589 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత స్థానంలో వరుసగా బెన్ స్టోక్స్, ట్రావిస్ హెడ్, డీకాక్, కరుణరత్నే ఉన్నారు. కోహ్లి ఈ లిస్టులో లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.
