తిరుమల దేవస్థానం నిర్మించిన తొండమానుడు తొండమాన్ రాజ్యపు చక్రవర్తి తిరుమలలో ఆయన పేరు,విగ్రహం,ఆయన పాలించిన రాజ్యపు చిహ్నం అన్నీ అప్పట్లో ఆలయ స్తంభాల్లో ఆవరణలో ఆయన చెక్కించుకున్నారు. లక్ష్మీ చెన్నకేశవ ఆలయం నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయలు ఆలయం ఆవరణలో ఆయన ప్రతిమతో పాటు ఆలయం నిర్మాణానికి ఆయన చేసిన కృషిని అక్షర రూపంలో రాయించారు.
యాదాద్రి నిర్మాణం అనేది మాములు విషయం కాదు అదొక చరిత్ర. ఆ చరిత్ర పుటల్లో ఆలయ అభివృద్ధి ప్రదాత ప్రతిమ ఉండొచ్చు తప్పేమీ లేదు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా సొంత డబ్బులతో నిర్మిస్తున్నాడా అనవచ్చు. ఐతే తొండమానుడు, శ్రీకృష్ణ దేవరాయలు కూడా సొంత డబ్బులతో ఆలయాలను నిర్మించలేదు.. వారు వారిహాయంలో నిర్మించారు కాబట్టి వాళ్లు చరిత్రలో గుర్తుగా వారిపేర్లు పెట్టుకున్నారు.. గుడి ఎప్పటికి ఉంటుంది కాబట్టి గుడి కట్టించిన వారు కచ్చితంగా పేర్లు ఉంటాయి. మతంలో రాజకీయ0 చేసే వారికి ఎం తెలుస్తుంది. గుడి కట్టించడం.. పూజించడం.. సృష్టి మొదలైనప్పటినుంది కట్టిన గుడులు అన్నింటికీ కట్టినవారెవరో పునరుద్ధరణ చేసిన వారెవరో గుడి గొడలపై లేవా. మత రాజకీయాలు చేసే వారికి ఇదే పని.
అక్కడ కేసీఆర్ ఒక్కరి ఫోటోనే లేదు..
- ఇప్పుడున్న 5రూపాయల బొమ్మ
- గాంధీ ఫోటో
- కరెన్సీ నోట్స్
- క్రికెట్
- ఇప్పుడు వాడుతున్న ఆయుధాలు
- భారత రాజముద్ర
- బతుకమ్మ ,కలశం
- ఇస్రో రాకెట్స్
- నెహ్రు ఫోటో
- 1 రూపాయి కాయిన్
- హరితహారం.. Etc
ఎందుకంటే ఇది ఒక చరిత్రకు మూలం ఈ యుగంలో ఉన్న విషయాలు.. చరిత్రకారులు చరిత్రను ఈ విధంగా వేరిపై చేసి మనకు చరిత్రను ఇచ్చారు.