తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు నూతన సచివాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నూతన సచివాలయం నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు పలు విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయంపై నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘంతో పాటు నిపుణులతో కలిసి కమిటీను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుత సచివాలయంపై నివేదికను ముఖ్యమంత్రికి అందజేసింది కమిటీ. ఈ కమిటీ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న సచివాలయం ఎప్పుడో ఆరవై ఏళ్ల కింద నిర్మించారు. నిర్మాణంలో సరైన ప్రమాణాల్లేవు. ఫైర్ సెప్టీ ,గ్రీన్ ఫైబర్ గురించి సరైన ప్రమాణాల్లేవు.
గత నాలుగేండ్లల్లో మూడు సార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న సచివాలయానికి ఎంట్రీకి ఎగ్జిట్ కు ఒక గేటు మాత్రం ఉంది. దీంతో ముఖ్యమంత్రి రాకపోకల సందర్భంగా భద్రతపరంగా సమస్యలు ఉన్నాయి. నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం ఉన్న సచివాలయం నిర్మించారు. సచివాలయం మొత్తం అస్తవ్యస్తంగా నిర్మించారు. అందుకే నూతన సచివాలయం అవసరం అని వారు ఆ కమిటీలో పేర్కున్నట్లు సమాచారం..!