తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక బహిరంగ లేఖను రాశారు. అయితే ఈ లేఖలో గ్రామపంచాయతీలను ఉద్ధేశించి ఆయన రాశారు. ఆ లేఖలో ఏముందంటే..?
ప్రియమైన తెలంగాణ ప్రజలకు
నా నమస్సుమాంజులు. రాష్ట్రంలోని ప్రతి పల్లె దేశంలో కెల్లా ఆదర్శ పల్లెగా నిలవాలనే నా ఆరాటం. అదే నా లక్ష్యం. ఈ లక్ష్యంతోనే మన ప్రభుత్వం సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందించిన సంగతి విదితమే. ఈ ప్రణాళికలో భాగంగా మొత్తం ఆరవైరోజుల్లో రాష్ట్రంలోని గ్రామాలు.. పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా.. పల్లెలుగా అభివృద్ధి కావాలి.
గ్రామాల్లో పల్లెల్లో పచ్చదనం.. పరిశుభ్రత మెరుపడాలి. గ్రామ పాలనలో గుణాత్మక మార్పును తీసుకువచ్చే మహోత్తర ప్రయత్బంలో భాగంగా సర్కారు ఒక నూతన పంచాయతీ చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెస్తున్నాము. స్థానిక ప్రజాప్రతినిధులు,గ్రామ ప్రజలందరీ సహాకారంతో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీలకు కావాల్సిన నిధులు, చేయాల్సిన చట్టాలు ప్రభుత్వం అందించింది. పల్లె ప్రగతికి మంచి మార్గం చేయడానికి నేటి నుంచే ముప్పై రోజుల ప్రణాళికతో ప్రత్యేక కార్యాచరణ మొదలవుతుంది.
దిన్ని విజయవంతం చేసే బాధ్యత మీ అందరిచేతుల్లో ఉంది అని మనవి చేస్తున్నాను. మీరందరూ కల్సి వచ్చి మీ గ్రామాన్ని.. మీ పల్లెను మీరే తీర్చిదిద్దుకోవాలి. గ్రామాల్లో పల్లెల్లో అవసరమైతే శ్రమదానం చేయాలి. మీ గ్రామానికి మీరే కథానాయకులు .. మీరంతా ఈ ముప్పై రోజులు ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణగా పని చేసి తెలంగాణ గ్రామాలను,పల్లెలను దేశంలో కెల్లా ఆదర్శ గ్రామాలుగా.. పల్లెలుగా తీర్చిదిద్దుతారని నమ్ముతున్నాను..
మీ-
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..