ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభిస్తుందా.. లేదా అనేది ఇప్పుడు మొత్తం ఏపీ ప్రజలతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో తనపై ఉన్న కేసుల విచారణ నేపధ్యంలో ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తూ వస్తున్నారు. ఎంతో కష్టతరంగా పాదయాత్ర చేసేటపుడు కూడా జగన్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అప్పటికప్పుడు హైదరాబాద్ కు చేరుకుని కోర్టుకు హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉందని అందుకు తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసారు.
దీనిపై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. గతంలోనూ ఒకసారి ఇదేవిధంగా జగన్ తరపు న్యాయవాది పిటీషన్ ను వేయగా హైకోర్టు సమర్ధించినా సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ అనంతరం కోర్టు ఏ తీర్పునిస్తుందోనని ఆసక్తి కరంగా మారింది. అయితే ఇప్పటివరకూ ఎంత కష్టమైనా జగన్ న్యాయస్థానాలకు గౌరవం ఇచ్చి కోర్టుకు హాజరవుతూ వచ్చారు. చంద్రబాబులా విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకోలేదంటూ వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.