వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబు గారిదని. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడని అన్నారు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడని చెప్పుకొచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపి 60 వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడం అసాధారణ నిర్ణయని, ఏపీ ముఖ్యమంత్రి గారి సాహసాన్ని అభినందించడానికి పచ్చ బానిస మేధావులెవరికీ నోరు రావడం లేదు. కుల మీడియా అయితే విలీనం అసంభమవమని మొన్నటి వరకు పస లేని వాదనలు తెరపైకి తెచ్చింది. అని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకిచ్చిన ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేదని, ప్రైవేటు ఆపరేటర్లకు కోసం ఆర్టీసీని కొల్లగొట్టారు. విలువైన భూములను తన వాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణాలకు లీజుకిచ్చారు. ఆర్టీసీని ఆయన మూసివేత దశకు చేర్చి పోతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలుపుకుని ఊపిరి పోశారని అన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపి 60 వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడం అసాధారణ నిర్ణయం. @AndhraPradeshCM గారి సాహసాన్ని అభినందించడానికి పచ్చ బానిస మేధావులెవరికీ నోరు రావడం లేదు. కుల మీడియా అయితే విలీనం అసంభమవమని మొన్నటి వరకు పస లేని వాదనలు తెరపైకి తెచ్చింది. @ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 6, 2019
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు @ncbn గారిది. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడు. @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 6, 2019