ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ స్మిత్..దాంతో ఇంగ్లాండ్ బౌలర్స్ అలెర్ట్ అయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్మిత్ ని ఆపలేకపోయారు. దీంతో స్కోర్ ను ముందుకు నడిపిస్తూ ఈ క్రమంలోనే సెంచరీ, డబుల్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజాలు సైతం అతడిని స్మరిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ ఆటగాడైన బ్రాడ్ మాన్ తో సమానంగా అతడిని కొలుస్తున్నారు.
