Home / UPDATES / తిరుమల ఏడుకొండల పేర్లేంటి..? ఒక్కో కొండకు ఉన్న పరమార్థం ఏంటీ..?

తిరుమల ఏడుకొండల పేర్లేంటి..? ఒక్కో కొండకు ఉన్న పరమార్థం ఏంటీ..?

తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి కలియుగదైవంగా పూజలందుకుంటున్నాడు. స్వామి వారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులు కాలినడకన ఏడుకొండలు ఎక్కి తిరుమలకు చేరుకుంటారు. ప్రతి నిత్యం గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతాయి. ఈ ఏడుకొండలు ఎక్కుతుంటే భక్తులు అలౌకిక అనుభవానికి లోనవుతారు. అసలు తిరుమల ఏడుకొండల పేర్లేంటి…ఒక్కో కొండకు పరమార్థం ఏంటో తెలుసుకుందాం. తిరుమల ఏడుకొండలను వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి అనే నామాలతో తిరుమల ఏడుకొండలను పిలుస్తారు. ఈ ఏడు కొండలు సాల గ్రామాలే. మహర్షుల అంశలే ఈ ఏడుకొండలు అని చెబుతారు. తిరుమలను సందర్శించే భక్తులు కాలినడకన ఒక్కో కొండ ఎక్కుతూ..స్వామిని చేరుకుంటారు. ముందుగా వృషభాద్రి గిరి గురించి తెలుసుకుందాం. వృషభం అంటే ఎద్దు…మహాశివుడి వాహనమైన నందీశర్వుడి పేరుతో వృషభాద్రి కొండ పిలువబడుతుంది. వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వారు ఈ మొదటి కొండ ఎక్కుతారు.ఇక వృషాద్రి అంటే ధర్మం… నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి..దాని వల్ల ఇహంలోను, పరంలోను, సుఖాన్ని పొందుతాడు..అవి చేయడమే వృషాద్రి కొండను ఎక్కడం. ఇక విష్ణుమూర్తి వాహనం గరుడుడి పేరుతో గరుడాద్రి కొండ పిలువబతుంది. గరుడాద్రి అంటే పక్షి.. అంటే ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ – అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. ఇక అంజనాద్రి ఆంజనేయుడి కొండగా పిలువబడుతుంది. అంజనం అంటే కంటికి కాటుక..ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు… ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉంది అని తెలుసుకోవడమే.. కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే అని నమ్మిన భక్తుడు అంజనాద్రి దాటతాడు. అలాగే శ్రీ మహావిష్షువు శయనించే శేషుని పేరుతో శేషాద్రి కొండ పిలువబడుతుంది. ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసేవారికి రాగద్వేషాలు ఉండవు. వారికి క్రోధం ఉండదు. వారికి శత్రుత్వం ఉండదు. అలాంటి వారు శేషాద్రిని దాటుతారు. ఇక శ్రీ వేంకటేశ్వరుని పేరుతోనే వేంకటాద్రి కొండ పిలువబడుతుంది. వేంకటాద్రి అంటే పాపం తీసేయడం..అంటే పాపాలు పోతాయి. ఇక నారాయద్రి కొండ నారాయణ నారాయణ అని జపించే నారద మహర్షి పేరుతో పిలువబడుతుంది. నారాయణాద్రి అంటే బ్రహ్మం అని అర్థం.. అంటే మానవుడు తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి.ఇదీ..తిరుమల ఏడుకొండల పేర్ల వెనుక ఉన్న పరమార్థం..ఒక్కో కొండను ఎక్కుతూ జీవుడు..చివరకు చేరుకునేది భగవంతుడినే అని ఏడుకొండలు చాటిచెబుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat