వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాను నెల 6 , 7 న మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనునన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు కేహెచ్‌యూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తొలి విడుత వెబ్ కౌన్సిలింగ్‌లో యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎ్‌స), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కేటగిరి-ఏ సీట్లను భర్తీ చేయనున్నారు. కాగా తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అయితే ఆలిండియా కోటాలో సీటు పొందిన అభ్యర్థులు మాత్రం ఈ వెబ్ కౌన్సిలింగ్‌కు అనర్హులు అని కేహోచ్‌యూ ప్రకటించింది. మరింత సమాచారం కోసం కేహెచ్‌యూ వెబ్‌సైట్‌ను చూడవలసిందిగా అధికారులు సూచించారు. ఇక ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఈ నెల 5 నుంచి 11 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సో..గెట్ రెడీ…ఆయుష్ వైద్య విద్య సీట్లకుగాను అర్హులైన అభ్యర్థులు వెబ్ కౌన్సిలింగ్‌కు హాజరు కాగలరు. అలాగే వెబ్ ఆప్షన్ల నమోదులో జాగ్రత్తలు పాటించండి. ఆల్ ద బెస్ట్…!
Tags Ayusgh convener Kaloji health university KHU notification quota seats telangana waranagal web counseling