విజయ్ దేవరకొండ, రష్మిక మంధన జంటగా నటించిన మొదటి చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం వీరిద్దరి కెరీర్ లోనే సూపర్ హిట్ మూవీ అని చెప్పాలి. ఈ చిత్రంతోనే వీరికి బెస్ట్ కపుల్ అని పేరు కూడా వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కాలేజీలో లెక్చరర్ గా చేస్తాడు. క్లాసులో ఒక స్టూడెంట్ అతడికి లైన్ వేస్తుంది. అలా కొన్ని రోజులుకి ఎంఎంఎస్ ద్వారా ఒక అశ్లీల వీడియోని పంపిన సన్నివేశం అందరికి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ ఆ అమ్మాయి తో కలిసి ఉన్న ఒక ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. దాంతో ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా పుకార్లు కూడా వస్తున్నాయి.